జనసేనకు సైలెంట్ ఓటింగ్.. మే 23న మా సత్తా తెలుస్తుంది: మాదాసు

ఏపీ ఎన్నికల్లో జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందంటున్నారు ఆ పార్టీ నేత మాదాసు గంగాధర్. ఏపీ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. తమకు సైలెంట్ ఓటింగ్ వచ్చిందని..‌ అది ఎంత అనేది మే 23న తెలుస్తుందన్నారు. ఎవరెవరో ఏదేదో మొరుగుతుంటారు.. అన్నిటికీ తాము స్పందించమన్నారు. ఎన్నికల తర్వాత జనసేన ఉండదన్నారని.. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన మాదాసు.. ఎన్నికల సరళిపై స్పందించారు.

Pawankalyan on telangana elections

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీగా రాజకీయాలు చేయడమే నేర్పారని.. రాష్ట్ర రాజకీయాలలో మార్పు తేవాలనే తపనతో పనిచేస్తున్నారన్నారు. మార్పు కోసం ఆయన చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల్లోనూ ప్రజలకు సేవ చేయాలనుకున్న సామాన్యులకు పవన్ సీట్లు ఇచ్చారన్నారు. ఫలితాలు వచ్చే వరకు తాము వేచి చూస్తామని.. మిగిలిన పార్టీల్లా జనసేనకు ఎలాంటి ఆందోళనలు లేవన్నారు. ప్రజల తీర్పు వెలువడ్డాకే తమ పార్టీ స్పందన ఉంటుంది. త్వరలో ఉత్తరాంధ్రలో పవన్ పర్యటిస్తారని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో సమావేశమై.. ఎన్నికలు, పోలింంగ్ సరళితో పాటూ కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలవారీగా పార్టీ యువ అభ్యర్థులతో ఈ వరుస భేటీలు నిర్వహించారు. అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా పవన్ నేతలతో చర్చించారు.