భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ సందర్భంగా బి.జె.పి.కి రూపకల్పన చేసిన మహనీయులు శ్రీ అటల్ బిహారి వాజపేయి,శ్రీ లాల్ కిషన్  అద్వానీ, శ్రీ భైరాన్ సింగ్ షెకావత్ వంటి రాజకీయ యోధులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన  భారతీయ జనతా పార్టీ, ప్రజల పార్టీగా ఆవిర్భవించింది. ఆ పార్టీ ఎన్నికలలో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. వ్యవస్థాపక నేతల ఆశలను ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారు..ఇలా ఒకరేమిటి పార్టీలో అంతర్గతంగా పని చేస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ప్రతీ ఒక్కరికి శుభాభినందనలు తెలియచేస్తున్నాను అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

1980 ఏప్రిల్ 6 వ తేదీన ఊపిరి పోసుకున్న భారతీయ జనతా పార్టీ ( బి.జె.పి) నేటికి నలభై వసంతాలు పూర్తి చేసుకుని 41వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.